IND vs AUS : కొండంత లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఉతికారేస్తున్నారు. ఇషాన్ కిషన్(58) హాఫ్ సెంచరీతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే… ఆ వెంటనే అగా సంఘా ఓవర్లో ఔటయ్యాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ (55) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సియాన్ అబాట్ ఓవర్లో భారీ సిక్సర్‌తో సూర్య ఫిఫ్టీ సాధించాడు. 25 రన్స్‌కే 2 వికెట్లు పడిన సమయంలో ఇషాన్‌తో సూర్య మూడో వికెట్‌కు133 పరుగులు జోడించాడు. ఇషాన్ వెనుదిరగడంతో తిలక్ వర్మ(3) క్రీజులోకి వచ్చాడు.14 ఓవర్లకు స్కోర్..144/3.
భారీ ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 3 ఓవర్లలోపే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. భారీ షాట్లతో కనిపించిన యశస్వీ జైస్వాల్(21) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు రుతురాజ్ గైక్వాడ్(0) ఖాతా తెరవకుండానే రనౌటయ్యాడు.