Rashid Khan : అఫ్గనిస్థాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్(Rashid Khan)కు వెన్నెముక సర్జరీ(Back Surgery) సక్సెస్ అయింది. గురువారం ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఆస్పత్రి బెడ్ మీద నవ్వుతూ, విజయసంకేతం చూపిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. సర్జరీ విజయవంతమైంది. ఇక కోలుకోవడం మీద దృష్టి పెట్టాలి. మళ్లీ మైదానంలోకి దిగేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని రషీద్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అతడి పోస్ట్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ వెంటనే స్పందించింది. ‘నువ్వు తొందరగా కోలుకుంటావు. కింగ్ ఖాన్’ అని కామెంట్ పెట్టింది.
రషీద్ ఖాన్
భారత్ గడ్డపై ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో రషీద్ అద్భుతంగా రాణించాడు. స్పిన్ ద్వయం ముజీబ్, నబీతో కలిసి ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్‌పై అఫ్గన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే.. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రషీద్ ఆడలేదు. మెగా టోర్నీ తర్వాత సర్జరీ చేయించుకుంటానని ప్రకటించిన రషీద్.. ఆసీస్‌లో జరుగుతున్న బిగ్‌బాష్‌లీగ్ 13వ సీజన్‌కు దూరమయ్యాడు.