TS Minister Jagadish Reddy | సూర్యాపేటలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన బీఆర్ఎస్ అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా సబ్బండ వర్గాలు ఏకమవుతున్నాయి. జగదీష్ రెడ్డి నాయకత్వం సూర్యాపేట ప్రజలకు అవసరమంటూ ప్రచార ఖర్చుల నిమిత్తం స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఆత్మకూరు మండలం కోటపహాడ్ రైతు ముత్యాలు తనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలకు కృతజ్ఞతగా తనవంతుగా రూ. 50 వేలు విరాళంగా అందజేశారు.
తండాలను పంచాయతీలుగా మార్చడమే కాకుండా, గిరిజనబంధు హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా రామోజీ తండా వాసి జత్యా నాయక్ తనవంతు విరాళాన్ని అందజేశారు. దళిత బంధుతో తమ కుటుంబంలో వెలుగు నింపిన మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా సోమపొంగు వెంకన్న అనే సోదరుడు రూ. 20వేలు విరాళంగా అందజేశారు.
దశాబ్దాల సూర్యాపేట వెనుకబాటును పారద్రోలి, పదేండ్లలోనే కనివినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేసిన
జగదీష్ రెడ్డి దొరకడం ఈ ప్రాంత వాసులందరి అదృష్టం అని లబ్ధిదారులు పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్ బంగారుమయం కావాలంటే మరోసారి జగదీష్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.