చండూరు, ఫిబ్రవరి 23 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం కస్తాల గ్రామంలో కీ.శే.బొమ్మరబోయిన మల్లయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కస్తాల పరిసర గ్రామాల ప్రజలకు కామినేని ఆస్పత్రి సహకారంతో సోమవారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని బొమ్మరబోయిన మల్లయ్య సతీమణి జయమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయమ్మ, ఆమె కుటుంబ సభ్యులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మన్ డాక్టర్.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ.. గ్రామ, పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ పిజిషన్, కంటివైద్యం, ఎముకల వైద్యం, దంత వైద్యం, నరాల వ్యాధి, గుండె సంబంధిత వైద్య నిపుణులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
మెరుగైన వైద్య సేవలు అవసరమైన పక్షంలో కామినేని ఆస్పత్రి నార్కట్‌పల్లిలో చికిత్స అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల వెంకన్న, ఎంఈఓ సుధాకర్‌రెడ్డి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.గణశ్యామ్, ఏంజీయూ ఎన్.ఎస్.ఎస్, ఎన్.సీ.సీ కో ఆర్డినేటర్లు డా.మారం వెంకటరమణారెడ్డి, డా.మ్యాచెందర్, డా.రాజు, డా.ప్రవీణ్, కామినేని వైద్యులు డా.విష్ణుప్రియ, డా.మురళి, ప్రొఫెసర్ డా.శ్రీనివాస్, ప్రొఫెసర్ జ్యోతి, ఆనంద్, కుటుంబ సభ్యులు బొమ్మరబోయిన సైదులు, బొమ్మరబోయిన నాగార్జున, బొమ్మరబోయిన రమేశ్, బొమ్మరబోయిన రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కస్తాలలో మెగా శిబిరం