TTD SED Tickets | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
TTD SED Tickets | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. రూ.300 ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.
TTD SED Tickets | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. రూ.300 ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. అలాగే ఫిబ్రవరి మాసానికి సంబంధించిన వసతి గదుల కోటాను సైతం శుక్రవారమే విడుదల చేయనున్నది.
తిరుమల, తిరుపతిలోని వసతి గదుల టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు భక్తులు గమనించి టికెట్లను ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 16న జరిగే రథసప్తమి రోజున శ్రీవారి సన్నిధిలో సేవలందించే వలంటీర్ల కోసం స్లాట్లను 27న ఉదయం 10 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. శ్రీవారి సేవ, నవనీత సేవల్లో పాల్గొనే వలంటీర్ల కోసం స్లాట్లను 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం 3 గంటలకు పరాకమణి సేవలో పాల్గొనే వలంటీర్లకు ఆన్లైన్లో స్లాట్లను కేటాయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

