IPS Charu Sinha : తెలంగాణ సీఐడీ, అడిషనల్ డీజీపీగా ఐపీఎస్ అధికారిణి చారు సిన్హా (IPS Charu Sinha) బాధ్యతలు చేపట్టారు. 1996 బ్యాచ్ ఐపీఎస్ అయిన ఆమె గురువారం నేరపరిశోధన విభాగం అదనపు డిప్యూటీ జనరల్‌గా పగ్గాలు అందుకున్నారు. ఏడేళ్ల తర్వాత మళ్లీ చారు సిన్హా మళ్లీ తెలంగాణలో విధులు నిర్వర్తించనున్నారు. ఇంతకుముందు ఆమె సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో కీలక హోదాలో ఏడేళ్లు సేవలందించారు. ఈ సమయంలో ఆమె బిహార్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు.
సీఆర్పీఎఫ్లోని నాలుగు సెక్టర్లకు, దక్షిణాది విభాగానికి బాస్‌గా పని చేసిన తొలి ఐపీఎస్ ఆఫీసర్ తనే కావడం విశేషం. సీఐడీ అదనపు డీజీపీగా విధుల్లో చేరిన చారు సిన్హా మరికొన్ని అదనపు బాధ్యతలను కూడా నిర్వహించనున్నారు. మహిళల భద్రత, షీ టీమ్స్, భరోసా కేంద్రాలకు ఆమె పూర్తి స్థాయి ఏజీడీపీగా కొనసాగనున్నారు.