న్యూఢిల్లీ : ప్రజారోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి కోళ్లు, కోడిగుడ్ల దిగుమతిపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్డీఏ) సంపూర్ణ నిషేధం విధించింది.
అంతర్జాతీయంగా వ్యాపిస్తున్న వివిధ అంటువ్యాధులు, ముఖ్యంగా ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ తదితర వైరస్ల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. సౌదీ అరేబియా విడుదల చేసిన దేశాల జాబితాలో భారత్‌తోపాటు చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇండోనేషియా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలున్నాయి.