మహేశ్ బాబాయ్ మెచ్చుకున్నారు!
‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. 16వ ఏటనే నటుణ్ణి కావాలని నిర్ణయించుకున్నా. ముంబయి, పాండిచ్చేరి, న్యూయార్క్ వెళ్లి యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్న అనంతరం కథలు వినడం మొదలుపెట్టాను’ అన్నారు జయకృష్ణ ఘట్టమనేని. అగ్ర హీరో మహేష్‌బాబు అన్న కుమారుడైన ఈయన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవుతున్నారు.
‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. 16వ ఏటనే నటుణ్ణి కావాలని నిర్ణయించుకున్నా. ముంబయి, పాండిచ్చేరి, న్యూయార్క్ వెళ్లి యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్న అనంతరం కథలు వినడం మొదలుపెట్టాను’ అన్నారు జయకృష్ణ ఘట్టమనేని. అగ్ర హీరో మహేష్‌బాబు అన్న కుమారుడైన ఈయన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. అజయ్‌భూపతి దర్శకత్వంలో అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం జయకృష్ణ ఘట్టమనేని పాత్రికేయులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
- ఈ సినిమాకు ముందు చాలా కథలు విన్నా. అయితే దర్శకుడు అజయ్‌భూపతి చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా కథలోని ఎమోషన్స్, నా పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగా ఆకట్టుకుంది. డెబ్యూ హీరోకి ఇలాంటి కథ పర్ఫెక్ట్ అనే భావన కలిగింది.
- మహేష్ బాబాయ్ నన్ను ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తారు. ఆయన సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్, పాటల విజువల్‌గా బాగా వచ్చాయని మెచ్చుకున్నారు. నా స్క్రీన్‌ప్రజెన్స్ సూపర్బ్‌గా ఉందని, క్యారెక్టర్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యానని ప్రశంసించారు. బాబాయ్ కాంప్లిమెంట్స్‌తో సినిమా విజయంపై ధీమా పెరిగింది.
- రియలిస్టిక్‌గా సాగే ప్రేమకథ ఇది. బలమైన భావోద్వేగాలతో పాటు కథలో ప్రేక్షకులు ఏమాత్రం ఊహించలేని సర్ప్రైజ్లు చాలా ఉంటాయి. నేను పోషించిన శ్రీను పాత్రలో అల్లరి, ఆవేశంతో పాటు లోతైన ఎమోషన్స్ కనిపిస్తాయి. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం వల్ల యాక్షన్ ఘట్టాలు బాగా వచ్చాయి. నటుడిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. వ్యక్తిగతంగా మాత్రం యాక్షన్ సినిమాలంటే ఇష్టం. భవిష్యత్తులో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

