ఉట్నూర్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం శ్రమించాలని ఐటీడీఏ పీవో ( ITDA PO) ఖుష్బూ గుప్తా ( Khushboo Gupta) అన్నారు. హైదరాబాదులోని మోడల్స్ కళాశాలలో ఉచిత ఇంటర్( Inter ) , ఐఐటీ (IIT) , జేఈఈ ( JEE) కోచింగ్ కోసం ఎన్నికైన 15 మంది విద్యార్థులను ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు పంపించారు.ఈ సందర్భంగా జెండాను ఊపి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ఆశ్రమ గురుకుల పాఠశాలలో చదివిన పదవ తరగతి విద్యార్థులను రాత పరీక్ష ,ఇంటర్వ్యూలు నిర్వహించగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 15 మంది విద్యార్థులను ఐఐటీ, జేఈఈ కోచింగ్ కోసం ఐటీడీఏ ద్వారా చదివిస్తున్నామని వెల్లడించారు.
గిరిజన విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉంటుందని, వారిని ప్రోత్సహించేందుకు ఐటీడీఏ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఎంపికైన గిరిజన విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.