ACP Madhavi | హుజూరాబాద్ టౌన్, జూన్ 5 : హుజూరాబాద్ ఏసీపీ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి మాధవిని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడటంలో మాధవికి మంచి పేరు ఉందని, అలాగే భవిష్యత్ లో మరింత పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ ఉమ్మడి జిల్లా కన్వీనర్ గూడూరి స్వామి రెడ్డి, సభ్యులు బండ లక్ష్మారెడ్డి, కాటిపల్లి సంజీవరెడ్డి, పసుల స్వామి, గూడూరి ప్రభాకర్ రెడ్డి, మొలుగూరి మొగిలి,జాన్, కంకణాల జనార్ధన్ రెడ్డి , నరేందర్, తదితరులు పాల్గొన్నారు.