పటిష్ట స్థితిలో జమ్మూకశ్మీర్
బ్యాటర్లందరూ నిలకడగా రాణించడంతో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ రెండో రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిరోజు శుభమ్ (121) సెంచరీకి తోడు సమద్ (61) రాణించగా ఓవర్ నైట్ స్కోరు 284/2తో బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు..
- రెండో రోజు భారీ స్కోరు
హుబ్లీ: బ్యాటర్లందరూ నిలకడగా రాణించడంతో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ రెండో రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిరోజు శుభమ్ (121) సెంచరీకి తోడు సమద్ (61) రాణించగా ఓవర్ నైట్ స్కోరు 284/2తో బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 527 పరుగుల భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పట్టు బిగించింది.
రిటైర్డ్ హర్ట్ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ పరాస్ (70), కన్హయ వాధవన్ (70), సాహిల్ (57 బ్యాటింగ్) అర్ధ శతకాలతో రాణించి ఆ జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. కర్ణాటక బౌలర్లు రోజంతా శ్రమించినా 5 వికెట్లు మాత్రమే తీయగలిగారు. మ్యాచ్ సందర్భంగా జమ్మూ సారథి పరాస్.. కర్ణాటక సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కేవీ అనీష్‌తో వాగ్వాదానికి దిగి హెల్మెట్‌తో అతడిని ఢీకొట్టాడు. నిబంధనలను అతిక్రమించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించే అవకాశాలున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

