Chinnaswamy Stampede : ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర(RCB)కు బిగ్ షాక్. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్ గెలుపొందిన ఆ జట్టు సంబురాల వేడుక విషాదాంతం కావడంతో ప్రజాగ్రహం పెల్లబికింది. దాంతో, పోలీసులు ఆర్సీబీ ఫ్రాంచైజీపై కేసు నమోదు చేశారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతికి పరోక్షంగా ఆర్సీబీ యాజమాన్యం కూడా కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు.
యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన చిన్నస్వామి తొక్కిసలాటపై కర్నాటక ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. పదకొండు మంది మరణానికి కారణమైన ఈ ఘటనపై విచారణ బాధ్యతలను జిల్లా మేజిస్ట్రేట్ జి.జగదీశకు అప్పగించింది. తొక్కసలాటపై సమగ్ర దర్యాప్తునుకు ఆదేశించిన మేజిస్ట్రేట్ గురువారం ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ సంఘం(KCA), ఈవెంట్ ఆర్గనైజేషన్ డీఎన్ఏ ఎంటైర్టైన్మెంట్కు నోటీసులు పంపిస్తామని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి ఆర్సీబీ యాజమాన్యంపై, కేసీఏపై కేసు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105తో పాటు మరో ఐదు సెక్షన్ల కింద ఆర్సీబీ, కేసీఏ, ఈవెంట్ సంస్థపై కేసు పెట్టారు పోలీసులు.
ಮುಖ್ಯಮಂತ್ರಿ @siddaramaiah ಅವರು ಬೌರಿಂಗ್ ಹಾಗೂ ವೈದೇಹಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದ ಬಳಿ ಕಾಲ್ತುಳಿತಕ್ಕೆ ಸಿಲುಕಿ ಗಾಯಗೊಂಡವರ ಯೋಗಕ್ಷೇಮ ವಿಚಾರಿಸಿ, ಮೃತರ ಕುಟುಂಬದವರಿಗೆ ಸಾಂತ್ವನ ಹೇಳಿದರು. pic.twitter.com/ereHQbTPHl
— CM of Karnataka (@CMofKarnataka) June 4, 2025
ఐపీఎల్ ఆరంభం నుంచి కప్ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఎట్టకేలకు 18వ సీజన్లో ఛాంపియన్గా అవతరించింది. తమ అభిమాన జట్టు ట్రోఫీతో స్వరాష్ట్రానికి రావడంతో విక్టరీ పరేడ్ కోసం కన్నడ ప్రజలు భారీగా చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తారు. బుధవారం మైదానంలో కర్నాటకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించారు. అనతంరం విక్టరీ పరేడ్ ఉంటుందని తెలిసి.. భారీగా అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. మైదానం సామర్థ్యం 35 వేలు కాగా.. బయట దాదాపు 3 లక్షల మంది పోగయ్యారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అందరూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
Prayers for the victims and their families of the Karnataka Bengaluru Chinnaswamy Stadium stampede incident.
Who should be held responsible for the crowd at Chinnaswamy Stadium that led to the tragic death of 11+ cricket fans? Many were injured.#IPLFinals #chinnaswamystadium pic.twitter.com/TChU1WlXiQ
— Shruti Dhore (@ShrutiDhore) June 5, 2025
అయితే.. కొందరు భారీ కేడ్లను దూకుతూ చొచ్చుకుపోగా.. తొక్కసలాట చోటుచేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటనలో 11 మంది మరణించగా.. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. బౌరింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లను పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య నష్టపరిహారం(Exgratia) ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని.. గాయపడిన వాళ్లకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మృతులకు రూ.2 లక్షలు, గాయపడినవాళ్లకు రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆర్సీబీ యాజమాన్యం కూడా గురువారం తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని వెల్లడించింది.