RDO Jayachandra reddy | వెల్దుర్తి, జూన్ 05 : భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో నిర్వహిస్తున్న రైతు సదస్సులను సద్వినియోగం చేసుకొని భూ సమస్యలపై దరఖాస్తులను అందించాలని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి రైతులకు సూచించారు.
గురువారం వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్, ఏదులపల్లి గ్రామాలలో తహసీల్దార్ బాలలక్షీ, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరీల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులను ఆర్డీవో జయచంద్రారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో రైతులు అందించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వారితో మాట్లాడారు.
ఏవైనా భూ సమస్యలు ఉన్న రైతులు రైతు సదస్సులలో దరఖాస్తు చేసుకుంటే వాటిని తహసీల్దార్ , డిప్యూటీ తహసీల్దార్ పరిధిలో పరిష్కరించడం లేదా ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు. ఈ రైతు సదస్సుల్లో ఆర్ఐ నర్సింగ్యాదవ్లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు