IPL 2025 : ఐపీఎల్.. కుర్రాళ్ల పాలిట అక్షయపాత్ర లాంటిది. దేశవాళీలో ఇరగదీసిన యంగ్‌స్టర్స్‌పై కాసుల వర్షం కురిపించే ఈ లీగ్.. ఎందరో యువ క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. వీళ్లలో వర్థమాన తారలుగా భారత జట్టు తలుపుతట్టిన వాళ్లూ ఉన్నారు. 18వ సీజన్లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న విప్రజ్ నిగమ్ (Vipraj Nigam) కూడా ఐపీఎల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న 20 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఐపీఎల్ తన జీవితాన్ని ఎంతో మార్చేసిందని చెబుతున్నాడు.
‘ఐపీఎల్‌తో నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. సీనియర్లు, అంతర్జాతీయ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. వాళ్లను గమనిస్తూ ఒత్తిడిని జయించడం అలవర్చుకున్నాను. చెప్పాలంటే ఇవన్నీ నాకు కొత్త అనుభవాలే. మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ నన్ను తీసుకున్నాక ఐపీఎల్ సన్నద్ధత గురించి మా కోచ్‌లతో మాట్లాడాను. నేను ఆల్‌రౌండర్‌గా రాణిస్తానని వాళ్లు నమ్మకంగా చెప్పారు. దేశవాళీలో నా బ్యాటింగ్ చూసి వాళ్లు ఆ మాట అనడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రెండు మూడు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశముంటుంది.
Delhi Capitals’ Vipraj Nigam credits coaches for shaping him into dynamic all-rounder
Delhi Capitals’ all-rounder Vipraj Nigam owes his success story to the coaches from the start of his career to those in the National BCCI Centre of Excellence in Bengaluru.
“I have played the… pic.twitter.com/asOpNW3Iwl
— Telangana Today (@TelanganaToday) May 21, 2025
కాబట్టి ఆ తర్వాత బ్యాటింగ్ మీద దృష్టి సారించాను. సిక్సర్లు బాదడం, ఫినిషర్‌గా రాణించడంపై కోచ్ సలహాలు పాటించాను. యూపీటీ20 లీగ్(UP T20)లో ఆడిన అనుభం కూడా ఐపీఎల్ 18వ సీజన్లో ఉపయోగపడింది’ అని విప్రజ్ తెలిపాడు. మెగా వేలంలో ఈ స్పిన్ ఆల్‌రౌండర్‌ను ఢిల్లీ రూ.50 లక్షలకు కొన్నది.
ఈ ఎడిషన్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ లెగ్ స్పిన్నర్ మిడిల్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంలో సఫలం అవుతున్నాడు. కుల్దీప్ యాదవ్ జతగా వికెట్ల వేట కొనసాగిస్తున్న ఈ యువకెరటం.. 10 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 28 పరుగులకే రెండు వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడీ యూపీ కుర్రాడు.