లక్నో: కరెంట్ కోతలతో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏకంగా ఏటీఎంలో ఆశ్రయం పొందింది. (Family Seeks Shelter In ATM) పిల్లలతో కలిసి రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఝాన్సీలో నిరంతర విద్యుత్ కోతలపై ప్రజలు మండిపడుతున్నారు. కరెంట్ కోతలకు వ్యతిరేకంగా నిరసనలు, నిరాహార దీక్షలు, రోడ్డు దిగ్బంధం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ కోతలతో ఒక కుటుంబం విసిగిపోయింది. ఏకంగా ఏటీఎం లోపల ఆశ్రయం పొందింది. మహిళలు, పిల్లలు రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు.
కాగా, తమ పరిస్థితి గురించి ఒక మహిళ వాపోయింది. తమ ప్రాంతం గత నెల రోజులుగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోందని తెలిపింది. నిరంతరాయంగా విద్యుత్, ఏసీ ఉన్న ఏకైక ప్రదేశం ఏటీఎం అని చెప్పింది. దీంతో తమ కుటుంబం మొత్తం ఇక్కడకు వచ్చామని ఆమె తెలిపింది. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే తామంతా రోడ్డుపైనే పడుకోవాల్సి ఉంటుందని మీడియాతో అన్నది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దీనిని ఎక్స్‌లో షేర్ చేశారు. సీఎం ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు విద్యుత్ శాఖపై ఆయన మండిపడ్డారు.
बिजली कटौती के मारे
एटीएम जा पहुँचे बेचारेउप्र बिजली विभाग, जिसकी ख़ुद की बत्ती गुल है।
कोई है? pic.twitter.com/uHufVHJItN
— Akhilesh Yadav (@yadavakhilesh) May 21, 2025
A woman resting with her family in the ATM claims they have reeling under massive power cuts for the past month. pic.twitter.com/oRTrAmq3vA
— Piyush Rai (@Benarasiyaa) May 20, 2025