Indiramma house | కంఠేశ్వర్, మే 21 : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇళ్లను పేదవారికి మాత్రమే మంజూరు చేయాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను బుధవారం కలిసి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా 13వ డివిజన్లో కొంతమంది రాజకీయ నాయకులు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, ఇళ్ల మంజూరు జాబితాలో తమకు అనుకూలమైన అభ్యర్థులను సిఫార్సు చేస్తున్నారని ఆర్థికంగా స్థిరంగా వ్యక్తులు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీని ద్వారా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
మంజూరు చేయబడిన జాబితాలో చాలామంది నిరుపేదల పేర్లు లేవని కాబట్టి రాజకీయ నాయకులు సిఫార్సు చేసిన వారి పేరు తొలగించి ప్రయోజనాలు కేవలం పేద ప్రజలకు చెందేలా చూడాలని మంజూరు చేయబడిన జాబితాపై విచారణ చేసి అవసరమైన తగు చర్యలు తీసుకొని పేద ప్రజలు ఆదుకోవాలని వినతి పత్రంలో కోరారు.