IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ వేలానికి ముందే ఎంతమందిని అట్టిపెట్టుకోవాలో బీసీసీఐ చెప్పేసింది. రిటెన్షన్ ప్రకారం ఐదుగురిని.. ‘రైట్ టు మ్యాచ్’ (Right To Match) ద్వారా మరొకరిని.. మొత్తంగా ఆరుగురిని ప్రతి ఫ్రాంచైజీ రిటైన్ చేసుకొనే వీలుంది. అయితే.. రైట్ టు మ్యాచ్ నిబంధనలో చేసిన మార్పులను పలు ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తున్నాయి. త్వరలో జరుగబోయే మెగా వేలంలో ఆర్టీఎమ్ విధానం ద్వారా అత్యధిక ధర పలికిన ఆటగాడికి మళ్లీ బిడ్డింగ్‌కు అనుమతించే అవకాశం ఉండడం సరికాదని ఫ్రాంచైజీ యజమానులు బీసీసీఐకి లేఖ రాశారు.
‘ప్రస్తుత రైట్ టు మ్యాచ్ నిబంధన ప్రకారం వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడికి మరో అవకాశం ఉంటుంది. అప్పుడు అతడి కోసం పోటీపడే ఫ్రాంచైజీలు బిడ్డింగ్‌లో పాల్గొంటాయి. అలాంటప్పుడు ఫ్రాంచైజీలు రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతాయి’ అని ఐపీఎల్ జట్ల యాజమానులు బీసీసీఐకి విన్నవించారు.
🧵 All you need to know about the #TATAIPL Player Regulations 2025-27 🙌 pic.twitter.com/lpWbfOJKTu
— IndianPremierLeague (@IPL) September 29, 2024
కొత్త నియమం ప్రకారం.. టీమ్ 1 ఒక ఆటగాడి కోసం రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకోవాలనుకుంది. అయితే.. వేలంలో టీమ్ 2 అతడికి రూ.6 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. అప్పుడు మీరు రూ.6 కోట్లకు బిడ్ వేస్తారా అని టీమ్ 1ను వేలం నిర్వాహకులు అడుగుతారు. అందుకు వాళ్లు అంగీకరిస్తే.. అప్పుడు టీమ్ 2 వేలం పాటను పెంచే అవకాశముంది. సదరు ఆటగాడి కోసం టీమ్ 2 రూ.9 కోట్లకు బిడ్ వేస్తే.. అప్పుడు టీమ్ ఆర్టీఎమ్ ద్వారా రూ. 9 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రూ.6 కోట్లకే టీమ్ 2 వేలం పాడకుంటే.. టీమ్ 1 ఆ క్రికెటర్‌ను అంతే మొత్తానికి ఆర్టీఎమ్ ద్వారా సొంతం చేసుకుంటుంది.
ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందే మెగా వేలం జరుగనుంది. ఈసారి కూడా విదేశాల్లోనే ఆక్షన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి రెండు వారాల్లో మెగా వేలం జరిగే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి మూడేండ్లకు ఓసారి జరిగే మెగా వేలం ఫ్రాంచైజీలకు చాలా కీలకం. ఇప్పటివరకూ ట్రోఫీ అందుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు స్క్వాడ్‌లో భారీ మార్పులు చేసుకునేందుకు ఇది చక్కని అవకాశం.
𝟑𝐫𝐝 𝐓𝐈𝐓𝐋𝐄 𝐅𝐎𝐑 𝐓𝐇𝐄 𝐊𝐍𝐈𝐆𝐇𝐓𝐒 🙌
Congratulations to the @KKRiders for clinching the 2024 #TATAIPL! The team showed great consistency throughout the tournament and kudos to @ShreyasIyer15 for leading the side brilliantly. Once again, thank you to the fans for… pic.twitter.com/WhU7Hc0RJr
— Jay Shah (@JayShah) May 26, 2024