2024 BMW M4 CS | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. దేశీయ మార్కెట్లో ఆల్ న్యూ ఎం4 సీఎస్ కారు ఆవిష్కరించింది. దీనిధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఇది కంప్లీట్లీ బిల్ట్ అప్ (సీబీయూ) మోడల్‌గా లభిస్తుంది. ఆసక్తి గల వారు బీఎండబ్ల్యూ డీలర్ల వద్దకు వెళ్లి ఈ కారు బుక్ చేసుకోవచ్చు. జీటీ రేస్ కార్స్ గుర్తుకు వచ్చేలా ఎల్లో డే టైం రన్నింగ్ లైట్ ఐకాన్స్ తోపాటు రీ డిజైన్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కిడ్నీ గ్రిల్లె, గర్నీ స్టైల్ స్పాయిలర్, సీఎఫ్ఆర్బీ డిఫ్యూజర్, టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్ విత్ ఫోర్ టెయిల్ పైప్స్, ప్రామాణికంగా ప్రీసియస్ సీఎస్ఎల్ స్టైల్ లేజర్ టెయిల్ లైట్స్, ఫ్రంట్‌లో 19 అంగుళాల యాక్సిల్, రేర్‌లో 20 అంగుళాల వీల్స్ ఉంటాయి.
బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ మోడల్ కారులో రెడ్ కలర్ పెయింట్ గల కాలిపర్స్ తోపాటు ఎం-కాంపౌండ్ బ్రేక్స్ ప్రామాణికంగా ఉంటుంది. ఎం కార్బన్ సిరామిక్ బ్రేక్స్ ఆప్షనల్‌గా అందిస్తుంది. ఈ కారు ఫోర్ వీల్ డ్రైవ్ ఎం ఎక్స్ డ్రైవ్ తోపాటు ఎంట్విన్ పవర్ టర్బో టెక్నాలజీతో కూడిన 4.0 లీటర్ల సిక్స్ సిలిండర్ ఇన్ లైన్ ఇంజిన్ విత్ ఎం-ట్విన్ పవర్ లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 550 హెచ్‌పీ విద్యుత్, 650 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం 3.4 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుందీ కారు. ఎం డ్రైవర్ ప్యాకేజీలో వస్తున్న స్పెషల్ ఎడిషన్ కారు గంటకు 302 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 8-స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ సస్పెన్షన్ (ఆఫర్ గా అడాప్టివ్ సస్పెన్షన్) ఉంటాయి.
బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ కారు బీఎండబ్ల్యూ లైవ్ కాక్ పట్ ప్రొఫెషనల్ తోపాటు బీఎండబ్ల్యూ హెడ్ అప్ డిస్ ప్లే ఇన్ కన్జంక్షన్, రీ డిజైన్డ్ ఎంట్రీ స్క్రీన్ ఆఫర్ చేస్తున్న అడ్వాన్స్డ్ డిస్ ప్లే అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, హెడ్ అప్ డిస్ ప్లే, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఫ్రంట్ అండ్ రేర్‌లో సెన్సర్లతోపాటు పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ యాక్టివ్ ప్రొటెక్షన్ , పార్క్ అస్టిస్టెంట్, హార్మాన్ కార్డోన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉంటాయి.