Matka Movie | మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తున్నాడు. మిగత 10 పైసల కోసం 99 మంది కొట్టుకుంటారు. నాలాంటోళ్లు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించేవాడివి. 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోకు. నీకు ఆ దమ్ము ఉంది అంటూ డైలాగ్‌తోనే టీజర్ మొదలైంది. ఇక టీజర్ చూస్తుంటే వరుణ్‌తేజ్ ‘వాసు’ అనే పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. వైజాగ్ నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో వరుణ్ నాలుగు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. నవీన్ చంద్ర, కిశోర్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.