IOC : ప్యారిస్ ఒలింపిక్స్ టోర్నీకి ముందు భారత ఒలింపిక్ సంఘం(IOC) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల ఆరంభ వేడుకల్లో భారత ‘చెఫ్ ది మిషన్’గా షూటర్ గగన్ నారంగ్ (Gagan Narang)ను ఐఓసీ ఎంపిక చేసింది. వెటరన్ బాక్సర్ మెరీ కోమ్ (Mary Kom) స్థానంలో నారంగ్ భారత బృందాన్ని నడిపిస్తాడని వెల్లడించింది. అంతేకాదు భారత మహిళా అథ్లెట్ల పరేడ్ సమయంలో తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) పతకధారిగా వ్యవహరిస్తుందని తెలిపింది.
మేరీకోమ్ వ్యక్తిగత కారణాలతో గత ఏప్రిల్‌లో ఛెఫ్ ది మిషన్ పోస్టుకు రాజీనామా చేసింది. దాంతో, ఐఓసీ అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha) చెఫ్ ది మిషన్‌గా షూటర్ గగన్ నారంగ్ పేరును ప్రతిపాదించింది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్‌తో పాటు పీవీ సింధు భారత పతకధారిగా ఉంటుందని ఉష వెల్లడించింది.
Gagan Narang, four-time Olympian and 2012 Olympic Games men’s 10m Air Rifle bronze medalist, has been chosen to replace MC Mary Kom as the Chef-de-Mission of the Indian contingent to compete in the Paris 2024 Olympic Games beginning on July 26 pic.twitter.com/CECURoskB3
— ANI (@ANI) July 8, 2024
‘ప్యారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరెమొనీలో భారత బృందానికి నాయకత్వం వహించే వ్యక్తి ఒలింపిక్ మెడలిస్ట్ అయి ఉండాలని అనుకున్నాం. అందుకు మేరీ కోమ్ స్థానంలో మా యువ సహచరుడు నారంగ్‌ను ఎంపిక చేశాం. ఇక.. రెండు పతకాలు గెలిచిన ఏకైక మహిళ అయిన సింధు.. శరత్ కమల్‌తో కలిసి భారత పతకధారిగా వ్యవహరింనుంది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా అని ఉష వివరించింది.