New EV Policy | కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలో ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టిన కార్ల తయారీ సంస్థలకు కేంద్రం ఇన్సెంటివ్‌లు అందిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. యూఎస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’.. ఇప్పటికీ భారత్‌లో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై ఖచ్చితమైన ప్రకటన చేయలేదు. స్థానికంగా హై ఎండ్ ఈవీ కార్ల తయారీకి కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థల కోసం కేంద్రం నూతన ఈవీ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
పెట్టుబడుల్లో లాభాల పరంగా ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలు ఇన్సెంటివ్‌లకు అర్హత కలిగి ఉంటాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా కేంద్రం తెచ్చిన ఈవీ పాలసీ పట్ల ఫోక్స్ వ్యాగన్-స్కోడా, హ్యుండాయ్-కియా, విన్ ఫాస్ట్ వంటి సంస్థలు ఆసక్తి కనబర్చారని అధికార వర్గాల కథనం. కార్ల తయారీ సంస్థలు సైతం ఈవీ కార్లతోపాటు పెట్రోల్-డీజిల్ కార్లను తయారు చేసే సంస్థల పెట్టుబడులకు ఇన్సెంటివ్ లు ఇవ్వాలని కార్ల తయారీ సంస్థలు కోరుతున్నాయి. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఈవీ కార్ల వాటా చాలా తక్కువ కనుక వాటి తయారీ కోసం భారీ పెట్టుబడులు పెట్టలేం అని కార్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అయితే, గత మార్చి 15న కేంద్రం ప్రకటించిన నూతన ఈవీ పాలసీపై ఏ ఒక్క కార్ల తయారీ సంస్థ కూడా తన అభిప్రాయాన్ని అధికారికంగా వెల్లడించక పోవడం గమనార్హం.
మార్చి 15న కేంద్రం ప్రకటించిన నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానం కింద కొత్త ప్లాంట్ల నిర్మాణానికి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఇన్సెంటివ్ లు ఇస్తామని కేంద్రం తెలిపింది. అటువంటి సంస్థలకు ఐదేండ్ల వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై కనీస వ్యయం, బీమా కవరేజీ తదితరాల ప్రకారం 15 శాతం దిగుమతి సుంకం విధిస్తామని కేంద్రం పేర్కొంది. కానీ, దేశీయంగా ప్లాంట్ ఏర్పాటు చేసే విషయమై గత ఏప్రిల్‌లో భారత్ లో పర్యటించాల్సిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. అర్థంతరంగా తన పర్యటన వాయిదా వేసుకున్నారు. సమీప భవిష్యత్ లో భారత్ లో విద్యుత్ కార్ల తయారీపై ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా కంపెనీ ఇప్పటికీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తొలి నుంచి దేశంలో కార్లను తయారు చేస్తున్న సంస్థలను పరిగణనలోకి తీసుకుని కొత్త ఈవీ పాలసీలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Mahindra Scorpio- N | మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Moto G85 5G | 10న భారత్ మార్కెట్లోకి మోటో జీ85 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
CMF Phone 1 | 50-ఎంపీ కెమెరా.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో సీఎంఎఫ్ ఫోన్1 ఆవిష్కరణ..!