Vijaya Shanti | ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కంటే తన టీడీపీ ప్రయోజనాలే రహస్య ఏజెండా ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతున్నదని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వచ్చారని అందరూ భావించారని విజయశాంతి తన `ఎక్స్ (మాజీ ట్విట్టర్)` ఖాతాలో పోస్టు చేశారు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనడం పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు.
`తెలంగాణాలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని.. తన కూటమి మిత్రపక్షం బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడటానికి కుట్రలు చేయాలని ప్రయత్నిస్తే టీడీపీతోపాటు బీజేపీ కూడా ఇక్కడ మునుగడంతోపాటు అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడి తీరుతాయి. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం.
అంతే కాదు, అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గార్కి, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలోపేతం చేస్తాం అని అనవలసిన అవసరం ఏమున్నది?` అని విజయశాంతి ప్రశ్నించారు.
కూటమి మిత్ర పక్షం బీజేపీకి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది. మీ నాయకులెవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటది, బహుశా` అంటూ.. హర హర మహాదేవ్.. జై తెలంగాణ అని విజయశాంతి ముగించారు.
Mahindra Scorpio- N | మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Moto G85 5G | 10న భారత్ మార్కెట్లోకి మోటో జీ85 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
CMF Phone 1 | 50-ఎంపీ కెమెరా.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో సీఎంఎఫ్ ఫోన్1 ఆవిష్కరణ..!