South Africa : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి బాధలో ఉన్న దక్షిణాఫ్రికా (South Africa ) టెస్టు సమరానికి సన్నద్ధమవుతోంది. రెండు టెస్టుల సిరీస్ కోసం ఆగస్టు నెలలో సఫారీ జట్టు వెస్టీండీస్ పర్యటనకు వెళ్లనుంది. దాంతో, సోమవారం సెలెక్టర్లు 16 మందితో కూడిన పటిష్టమైన బృందాన్ని ప్రకటించారు. తెంబా బవుమా (Temba Bavuma) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. యువకెరటం మాథ్యూ బ్రీట్జ్ ఈ సీరిస్తో అరంగేట్రం చేయనున్నాడు.
తొలిసారి ఐసీసీ ఫైనల్ చేరిన ఉత్సాహంలో దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌పై కన్నేసింది. అందుకని ఈ సిరీస్ విజయమే లక్ష్యంగా సీనియర్ ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న పేసర్ లుంగి ఎంగిడిని తీసుకున్నారు.
South Africa have named a 16-member squad for the upcoming #WTC25 series against West Indies 👇 https://t.co/zrcoTnHjWp
— ICC (@ICC) July 8, 2024
అయితే.. నిరుడు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన 15 మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే స్క్వాడ్‌లో చోటుదక్కింది. అగస్టులో సఫారీ జట్టు కరీబియన్ గడ్డపై కాలు మోపనుంది. ఆగస్టు 7వ తేదీన క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఆతిథ్య జట్టుతో బవుమా బ్యాచ్ తలపడనుంది. ఇదే వేదికపై ఆగస్ట్ 15వ తేదీన రెండో టెస్టు జరుగనుంది.
దక్షిణాఫ్రికా బృందం : తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ బెడింగమ్, మాథ్యూ బ్రీట్జ్, టెనీ డి జార్జీ, ఎడెన్ మర్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, రియాన్ రికెల్టన్, కైల్ వెర్రెయనే, వియాన్ మల్డర్, డేన్ పీటర్సన్, లుంగి ఎంగిడి, డనె పీడెట్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, నంద్రె బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ,