TGPSC JL | రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఖాళీగా ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా పరీక్షలకు సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఒక అభ్యర్థికి సంబంధించిన ఫలితాల్లో విత్హోల్డ్లో పెట్టినట్లుగా తెలిపింది. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో జాబితాను త్వరలోనే ప్రకటించనున్నట్లు వివరించింది. అలాగే, ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రేడ్-2 ప్రొవిజినల్ జాబితాను విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.