Wimbledon : మాజీ చాంపియన్ రిబాకినా (Elena Rybakina) వింబుల్డన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఆమె 17వ సీడ్ అయిన రష్యా సంచలనం అన్నా కలిన్స్కయా (Anna Kalinskaya)తో తలపడింది. తొలిసెట్‌ను 6-3తో ముగించిన ఆమె రెండో సెట్లోనూ జోరు చూపించింది.
అయితే.. కలిన్స్కయాకు అనుకోకుండా ముంజేతికి గాయమైంది. దాంతో, ఆమె ఆట నుంచి వైదొలిగింది. అందువల్ల చైర్ అంపైర్ రిబాకినాను విజేతగా ప్రకటించారు. తర్వాతి రౌండ్లో ఈ కజకిస్థాన్ బ్యూటీ 21వ సీడ్ ఎలీనా స్విటోలినాను ఢీ కొట్టనుంది.
ఈ ఏడాది వింబుల్డన్‌లో అదరగొడుతున్న రిబాకినా అత్యధిక విజయాలతో మరో రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ వింబుల్డన్‌లో 20 మ్యాచ్‌లు ఆడిన ఆమె ఏకంగా 18 విజయాలు నమోదు చేసింది. దాంతో, మహిళల సింగిల్స్‌లో 90 శాతానికి పైగా విక్టరీ రేటు ఉన్న టెన్నిస్ లెజెండ్స్ అన్ జోన్స్(Ann Jones), స్టెఫీ గ్రాఫ్ (Steffy Graff)ల సరసన చేరింది. 2022 చాంపియన్‌గా అవతరించిన రిబాకినా ఈసారి టైటిల్ వేటలో ముందుకెళ్తుందా? లేదా? అనేది స్విటోలినా మ్యాచ్‌తో తేలిపోనుంది.
Elena Rybakina has won 18 of her 20 matches at #Wimbledon
She joins Ann Jones and Steffi Graf as the only players in the Open Era to have a 90% win rate in ladies’ singles at The Championships 👏 pic.twitter.com/AvogKsAlR9
— Wimbledon (@Wimbledon) July 8, 2024