James Anderson : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) వీడ్కోలు మ్యాచ్‌కు రెడీ అయ్యాడు. సొంతగడ్డపై లార్డ్స్‌లో ఆఖరి మ్యాచ్ ఆడబోతున్నాడు. వెస్టిండీస్‌తో జూలై 10న జరిగే టెస్టుతో సుదీర్ఘ కెరీర్‌కు అండర్సన్ గుడ్ బై చెప్పేయనున్నాడు. వీడ్కోలు టెస్టుకు మరో రెండు రోజులే ఉందనగా ఈ స్పీడ్‌స్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకునేందుకు, కన్నీళ్లను ఆపేందుకు ప్రయత్నిస్తానని అండర్సన్ అన్నాడు.
‘రెండు మూడు రోజులుగా నేను యథావిధిగానే నెట్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా. చివరి టెస్టు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. నా ముందున్న ముఖ్యమైన పని ఏంటంటే.. బాగా బౌలింగ్ చేయడం, విజయంతో కెరీర్ ముగించడం. అందుకని పూర్తిగా బౌలింగ్ మీదే ఫోకస్ పెడుతున్నా. అయితే.. ఎమోషన్స్ అనేవి కామన్. కాబట్టి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా అని 41 ఏండ్ల అండర్సన్ తెలిపాడు.
అంతేకాదు దేశం తరఫున చివరిసారి అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నానని అన్నాడు.
‘నేను 42 ఏండ్లకు సమీపిస్తున్న సమయంలో 188వ టెస్టు ఆడుతున్నా. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆఖరి టెస్టులో నా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని అనుకుంటున్నా’ అని ఈ లెజెండరీ పేసర్ చెప్పాడు. లేటు వయసులోనూ కుర్రాళ్లతో పోటీగా వికెట్లు తీస్తున్న జిమ్మీ టెస్టు ఫార్మాట్ నుంచి సెలవు తీసుకోనున్నాడు.
భారత పర్యటనలో 700ల వికెట్ల క్లబ్లో చేరిన జిమ్మీ వీడ్కోలు మ్యాచ్‌కు ముందు కౌంటీ చాంపియన్‌షిప్ (County Championship)లో తన పేప్ పవర్ చూపించాడు. లాంక్షైర్ (Lacakshire) తరఫున ఆడిన జిమ్మీ.. నాటింగ్హమ్షైర్ బ్యాటర్లను వణికిస్తూ 7 వికెట్లతో చెలరేగాడు. దాంతో, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14వ సారి ఆరు వికెట్ల ఫీట్ సాధించాడు.