Tomato | మండే బ్లూస్ మాదిరిగా మళ్లీ టమాటా కష్టాలు వచ్చేశాయి. రోజువారీ కూరల్లో టమాటాల వాడకం తప్పనిసరి. సకాలంలో వర్షాలు కురవక పోగా హీట్ వేవ్ వల్ల వేసిన టమాటా తోటల నుంచి దిగుబడి తగ్గడంతో టమాటాలకు గిరాకీ పెరిగింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రో నగరాలతోపాటు పలు నగరాలు, పట్టణాల్లో కిలో టమాటా ధర సుమారు రూ.90 పలుకుతోంది. ఒకవైపు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అకస్మాత్‌గా టమాటా ధరలు పెరిగి పోవడంతో ఆహార వస్తువుల విభాగంలో అనిశ్చితి నెలకొంది.
హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటాలు కొనుగోలు చేసే వారి జేబులకు చిల్లు పడుతోంది. టమాటాల దిగుబడి తగ్గడంతోపాటు సరఫరా వ్యవస్థలో ప్రతికూల ప్రభావం పడుతున్నదని చెబుతున్నారు. టమాటా ఎక్కువగా పండించే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల రబీ సీజన్ పంట దిగుబడి తగ్గిపోయింది.. ఫలితంగా మార్కె్ట్లోకి వస్తున్న టమాటాలు 35 శాతం తగ్గాయని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది.
మరోవైపు ఈశాన్య రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు దెబ్బ తిన్నాయి. తత్ఫలితంగా ప్రధాన కేంద్రాలకు టమాటాల సరఫరా తగ్గిపోయిందని చెబుతున్నారు. దీంతో టమాటాల ధర పెరిగిందని అంటున్నారు. నెలరోజుల క్రితం రూ.35 పలికిన కిలో టమాటాలు.. ఈ నెల ఏడో తేదీన 70 శాతానికి పైగా వృద్ధి చెంది రిటైల్ మార్కెట్లో రూ.59.87 పలుకుతున్నాయి. అమెజాన్ ఫ్రెష్, స్విగ్గీ, జెప్టో వంటి ప్రముఖ డిజిటల్ సర్వీసెస్ సంస్థల్లో కిలో టమాటాలు రూ.80-90 పలుకుతున్నాయి. సెంటర్ ఫర్ ఎకనమిక్ డేటా అండ్ అనాలసిస్ (సీఈడీఏ) నివేదిక ప్రకారం గత మే నెల నుంచి క్రమంగా టమాటాల ధర పెరుగుతోంది. ఈ నెల ఐదో తేదీ నాటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.59.88 పలికింది. ఉత్తర భారత రాష్ట్రాల్లో కిలో టమాటా రూ.50 పలికితే.. ఈశాన్యంలో రూ.71,, పశ్చిమ భారతంలో రూ.60.5, దక్షిణ భారత రాష్ట్రాల్లో రూ.60 పలుకుతోంది.
గతేడాది కూడా భారీ వర్షాలు, పోటెత్తిన వర్షాలతో కిలో టమాటా ధర రూ.350 పలికిన సంగతి తెలిసిందే. టమాటాలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధరలు పెరిగిపోవడంతో గత నెలలో ప్రతి ఒక్క ఇంట్లో 10శాతం ఖర్చులు పెరిగాయని క్రిసిల్ తెలిపింది. టమాటా ధరలు 30 శాతం పెరిగితే, ఉల్లిగడ్డ ధరలు 60 శాతం వరకూ దూసుకెళ్లాయి. మరోవైపు బంగాళాదుంప 59 శాతం పెరగడంతో ఇండ్లలో కూరల తయారీ కష్టంగా మారిందన్న విమర్శలు ఉన్నాయని క్రిసిల్ తెలిపింది.
Mahindra Scorpio- N | మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Moto G85 5G | 10న భారత్ మార్కెట్లోకి మోటో జీ85 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
CMF Phone 1 | 50-ఎంపీ కెమెరా.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో సీఎంఎఫ్ ఫోన్1 ఆవిష్కరణ..!