హైదరాబాద్ : తమిళనాడులో(Tamil Nadu) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరులో కార్లను ఆర్టీసీ బస్సు(Rtc bus) ఢీ కొట్టడంతో 9 మంది మృతి చెందారు. ఇద్దరు పిల్లలతో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు నుంచి చెన్నైకి బయలు దేరిన ఆర్టీసీ బస్సు టైరు పేలి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న రెండు కార్లను బస్సు ఢీకొనడంతో ఘోరం జరిగిపోయింది.
గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తరలించారు. ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ. లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ వేగంతో బస్సు నడిపారా వంటి అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.