Russian girl dance : ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రష్యాకు వెళ్లారు. ఇవాళ, రేపు రష్యాలో ఆయన పర్యటన కొనసాగనుంది. మోదీ పర్యటన నేపథ్యంలో రష్యాలో భారీగా ఏర్పాట్లు చేశారు. రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ (Denis Manturov) మాస్కో ఎయిర్పోర్టు (Mascow) లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
ప్రధాని రాక నేపథ్యంలో స్వాగతం పలికేందుకు రష్యాలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారత్, రష్యా సంప్రదాయాల ప్రకారం ఇరుదేశాలకు చెందిన పలువురు కళకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. పలువురు రష్యన్ కళాకారులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి అభినయించారు. రష్యాకు చెందిన ఓ చిన్నారి భారతీయ వేషధారణలో చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది.
ఆ చిన్నారి నృత్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతీయ సంప్రదాయ వస్త్రాలైన లంగా, జాకెట్ వేసుకుని ఆ రష్యా చిన్నారి భాంగ్రా నృత్యం చేసింది. ఆ చిన్నారి నృత్యాన్ని కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Moscow, Russia | A young Russian girl, dressed in Indian attire, joins others in performing Bhangra. pic.twitter.com/UsQt1DRiMm
— ANI (@ANI) July 8, 2024