ECB : భారత పర్యటనకు ముందే ఇంగ్లండ్‌కు పెద్ద షాక్. ఇప్పటికే ప్రధాన పేసర్ మార్క్ వుడ్(Mark Wood) కండరాల గాయంతో జట్టుకు దూరం కాగా.. తాజాగా మారో స్పీడ్‌స్టర్ ఓలీ స్టోన్ (Olly Stone) సేవల్ని ఆతిథ్య జట్టు కోల్పోనుంది. కుడి మోకాలి గాయంతో బాధపడుతున్న అతడు సర్జరీ చేయించుకోనున్నాడు. దాంతో, స్టోన్ 14 వారాల పాటు జట్టుకు దూరం కానున్నాడు.
కాబట్టి జూన్‌లో సొంతగడ్డపై టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో స్టోన్ స్థానంలో మరో పేసర్‌ను తీసుకోనుంది ఈసీబీ. ‘ఇంగ్లండ్, నాటింగ్హమ్షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించే పేసర్ ఓలీ స్టోన్ 14 వారాలు క్రికెట్‌కు దూరం కానున్నాడు. కుడి మోకాలి గాయంతో బాధ పడుతున్న అతడికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించాం. సర్జరీ అనివార్యమని వైద్యులు సూచించారు. అందుకే.. ఈ వారంలో స్టోన్‌కు ఆపరేషన్ చేపిస్తాం.
Speedy recovery, Stoney 🙏
Olly Stone is to miss the start of the English Summer with a knee injury#EnglandCricket | Full Story 👇
— England Cricket (@englandcricket) April 4, 2025
ప్రస్తుతం అతడు పునరావాస కేంద్రంలో ఉన్నాడు. ఇంగ్లండ్, నాటింగ్హమ్షైర్ వైద్యులు పేసర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. సర్జరీ కారణంగా స్టోన్ 14 వారాలు అంటే.. వేసవిలో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఆగస్ట్‌లో అతడు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది’ అని ఇంగ్లండ్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
కుడి చేతివాటం పేసర్ అయిన స్టోన్ ఇప్పటివరకూ 5 టెస్టులు, 10 వన్డేలు.. ఒకే ఒక టీ20 ఆడాడు. నిరుడు శ్రీలంకతో చివరిసారి బరిలోకి దిగాడీ స్పీడ్‌స్టర్. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన ఈసీబీ.. మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు చేయనుంది.