IPL 2025 : సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్(60 : 30 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తొలి ఓవర్ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డ మార్ష్.. అశ్వినీ కుమార్ వేసిన 6వ ఓవర్లో వరుసగా 6, 4, రెండు పరుగులు తీసి అర్ధ శతకం సాధించాడు.
బౌల్ట్, దీపక్ చాహర్, శాంట్నర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు 27 బంతుల్లోనే ఫిఫ్టీకి చేరువయ్యాడు. దాంతో, లక్నో జట్టు 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(7) క్రీజులో ఉన్నాడు.