Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని భద్రాద్రిలో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ వేడుకల కోసం సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు బంగారు పట్టు చీరను రూపొందించాడు.
నేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ పది రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గంపై బంగారు పట్టు చీరను నేసాడు. వన్ గ్రాం గోల్డ్ ఇరి పట్టు దారంతో ఏమ గజాల చీరను గ్రా.800 బరువులో ఉండేలా తయారు చేశాడు.
చీర కొంగులో ఆలయ మూల విరాట్ దేవతామూర్తులు, బార్డర్లో శంకు చక్రతామాలు, హనుమంతుడు, గర్తత్మంతుడు, శ్రీరామ నామాలు ఉన్నాయి. నేడు భద్రాద్రికి వెళ్లి ఈ అరుదైన చీరను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని సంబంధిత అధికారులను కోరనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు.