IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ముగింపు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో ఫైనల్ జరుగనున్నందున అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం త్రివర్ణ శోభితమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)కు ప్రతీకగా గగనతలంపై వైమానిక దళాలు మువ్వన్నెల జెండాను ప్రదర్శిస్తూ అభిమానుల్లో జోష్ నింపాయి. స్వరమాంత్రికుడు శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) బృందం సైతం దేశభక్తి పాటలతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి మహదేవన్, ఆయన కుమారులు భారత సైనికుల కీర్తిని చాటే గేయాలను ఆలపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. నత్యకారులు సైతం మూడు రంగుల దుస్తులు ధరించి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక స్టేడియంలోని అభిమానులు అయితే.. జాతీయ పతాకాన్ని చేతబూని.. జై హింద్, జై భారత్ నినాదాలతో సందడి చేస్తున్నారు.
Lighting up the #Final with an enthusiastic Tribute Ceremony 🇮🇳#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile pic.twitter.com/b0WptvNnIO
— IndianPremierLeague (@IPL) June 3, 2025
ఐపీఎల్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్‌లో మెగా ఫైట్ జరుగనుంది. రెండింటో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ అవతరించినట్టే. సో.. విజేతగా నిలిచేది ఎవరు? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ సమఉజ్జీల పోరాటంలో 200 ప్లస్ స్కోర్ నమోదవ్వడం ఖాయం అనిపిస్తోంది.
ఎందుకంటే.. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ 203 రన్స్ కొట్టింది. భారీ ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీతో పంజాబ్ 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లింది. అటు ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్. కాబట్టి.. కప్ ముద్దాడేందుకు.. ఛాంపియన్ అనిపించుకునేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడాల్సి ఉంటుంది.
Countdown’s 🔛. So is destiny ❤
Who will walk away as the 𝐍𝐞𝐰 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧 tonight? 🏆#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/LOIImXfXpI
— IndianPremierLeague (@IPL) June 3, 2025