IPL 2025 : ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనేది ప్రతి జట్టు కల. కానీ, 18 ఏళ్లుగా ఆ రెండు జట్లు మాత్రం టైటిల్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీమ్‌లు ఐదేసి కప్పులు కొడితే.. ఒక్క ట్రోఫీని ముద్దాడేందుకు ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. అలాంటి ఆ జట్లలో ఒకటి ఛాంపియన్‌గా అవతరించనుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో.. లక్షమందికిపైగా ప్రేక్షకుల సమక్షంలో మురిపెంగా ట్రోఫీని అందుకోనుంది. కొత్త విజేతగా సంబురాల్లో మునిగిపోయేది ఎవరో మరికొన్ని గంటల్లో తెలియనుంది.
ఐపీఎల్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య అహ్మదాబాద్‌లో మెగా ఫైట్ జరుగనుంది. గతంలో 2009, 2011, 2016లో ఆర్సీబీ ఆఖరి మెట్టుపై తడబడగా.. 2014 ఎడిషన్ ఫైనల్లో కోల్‌కతా చేతిలో పంజాబ్ మట్టికరిచింది. రెండింటో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ అవతరించినట్టే. సో.. విజేతగా నిలిచేది ఎవరు? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
2⃣ Inspiring leaders 🫡
2⃣ Incredible teams 🙌
1⃣ 𝐁𝐥𝐨𝐜𝐤𝐛𝐮𝐬𝐭𝐞𝐫 𝐅𝐈𝐍𝐀𝐋 🤩🎥🔽 #PBKS skipper Shreyas Iyer and #RCB skipper Rajat Patidar reflect on their journeys ahead of the 𝘽𝙄𝙂 𝙊𝙉𝙀 👏#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile
— IndianPremierLeague (@IPL) June 3, 2025
సమఉజ్జీల పోరాటంలో 200 ప్లస్ స్కోర్ నమోదవ్వడం ఖాయం అనిపిస్తోంది. ఎందుకంటే.. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ 203 రన్స్ కొట్టింది. భారీ ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీతో పంజాబ్ 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లింది. అటు ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్. కాబట్టి.. కప్ ముద్దాడేందుకు.. ఛాంపియన్ అనిపించుకునేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడాల్సి ఉంటుంది.
తొలి కప్ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆర్సీబీకి ఇది మంచి తరుణమనే చెప్పాలి. ఆరంభ సీజన్ నుంచి బెంగళూరు జట్టుకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ కల సాకారం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సాలా కప్ నమదే స్లోగన్‌తో ఈసారి మరింత రెచ్చిపోయి ఆడుతున్న కోహ్లీ, ఫిల్ సాల్ట్ భీకర ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు అతిపెద్ద బలం. ఇక మిడిల్ ఓవర్లలో రఫ్ఫాడించేందుకు రజత్ పాటిదార్, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్‌లు ఉండనే ఉన్నారు.
Shreyas Iyer has scored three unbeaten fifties in his last three games in Ahmedabad, but he is up against Josh Hazlewood tonight.
IPL final preview ▶️ https://t.co/WIXxwtLzSe pic.twitter.com/5xYzyJjnhi
— ESPNcricinfo (@ESPNcricinfo) June 3, 2025
బౌలింగ్ యూనిట్లో జోష్ హేజిల్‌వుడ్ నిప్పులు చెరుగుతున్నాడు. క్వాలిఫయర్ 1లో అతడి ధాటికి పంజాబ్ టాపార్డర్ కకావికలమైంది. 21 పరుగులకే 3 కీలక వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్ పంజాబ్ పతనాన్ని శాసించాడు. ఫైనల్లో కూడా అతడి నుంచే పంజాబ్ టాపార్డర్‌కు ముప్పు పొంచి ఉంది. లీగ్ దశలో ఓసారి, క్వాలిఫయర్ 1లో ఓసారి అయ్యర్‌ను ఔట్ చేసిన హేజిల్‌వుడ్ ఫైనల్లోనూ అదిరే ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాడు.
రెండోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్న పంజాబ్ 18వ సీజన్లో వారెవా అనిపించేలా ఆడింది. ఏకంగా 8 పర్యాయాలు ఆ జట్టు 200 ప్లస్ స్కోర్ చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లు శుభారంభాలు ఇవ్వడంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఆడగల శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుకు కొండంత బలం. క్వాలిఫయర్ 2లో ముంబైపై పంజాబ్ సారథి కళాత్మక షాట్లతో అలరించాడు. ఏడోసారి ఫైనల్ చేరాలనుకున్న ముంబై ఆశల్ని ఆవిరి చేస్తూ.. వీరోచిత అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు.
𝑲𝒊𝒔𝒊 𝒄𝒉𝒆𝒆𝒛 𝒌𝒐 𝒂𝒈𝒂𝒓 𝒔𝒉𝒊𝒅𝒅𝒂𝒕 𝒔𝒆 𝒄𝒉𝒂𝒂𝒉𝒐…🥹 pic.twitter.com/MlXtvnK4Gq
— Punjab Kings (@PunjabKingsIPL) June 3, 2025
ఇక డెత్ ఓవర్లలో ధనాధాన్ ఆడేందుకు శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్‌లు కాచుకొని ఉంటున్నారు. ఆర్సీబీ మాదిరిగానే పంజాబ్ బౌలింగ్ యూనిట్ బలంగానే ఉంది. ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ విఫలం అవుతున్నా.. కైలీ జేమీసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. క్వాలిఫయర్ 2లో ముంబైపై అద్భుతంగా బౌలింగ్ చేశాడీ పొడగరి పేసర్. మార్కో యాన్సెస్ స్థానాన్ని భర్తీ చేస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు జేమీసన్. అహ్మదాబాద్‌లో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తిప్పేస్తే ఆర్సీబీకి కష్టాలు తప్పకపోవచ్చు. 2016 ఫైనల్లో బెంగళూరుకు ఆడిన యుజీ.. ఈసారి పంజాబ్ తరఫున తొలి ఫైనల్ ఆడుతున్నాడు.