టీడీపీ మాజీ మంత్రి నా ఆస్తి కబ్జా చేశాడు.. ఎన్నారై నేత మురళీమోహన్ ఆవేదన
ఏపీ టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు తన ఆస్తిని కబ్జా చేశారని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సభ్యుడు రావి మురళీ మోహన్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలోని చిలకలూరిపేటలో తనకు సాయికార్తీక్ సిటీ సెంటర్ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ ఉందని తెలిపారు.
ఖైరతాబాద్, జూన్ 3 : ఏపీ టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు తన ఆస్తిని కబ్జా చేశారని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సభ్యుడు రావి మురళీ మోహన్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలోని చిలకలూరిపేటలో తనకు సాయికార్తీక్ సిటీ సెంటర్ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ ఉందని తెలిపారు. సదరు కాంప్లెక్స్‌లో రెండు థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, రెండు అంతస్తుల వాణిజ్య సముదాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటి విలువ సుమారు రూ.69 కోట్ల ఉంటుందని చెప్పారు.
ఉద్యోగరీత్యా తాను 20 సంవత్సరాలుగా అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నానని మురళీమోహన్ తెలిపారు. గత పది నెలల క్రితం ఏపీకి చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు తన షాపింగ్ కాంప్లెక్స్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాని తెలిపారు. తన తండ్రి కందిమల్ల అంజిబాబు అనే వ్యక్తి వద్ద రూ.97లక్షల రుణం తీసుకున్నాడని ఆరోపిస్తూ తన ఆస్తులను కబ్జాదారులు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. నిజంగానే రుణం తీసుకుంటే తాను మొత్తం చెల్లిస్తానని చెప్పారు. రుణం పేరుతో తన ఆస్తిని కబ్జా చేస్తున్నారని, వారికి మాజీ మంత్రి పత్తిపుల్లారావు సహకారం ఉందన్నారు. ఈ విషయంపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టడం లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. తన ఆస్తులను కబ్జా చేసిన వ్యక్తులందరూ టీడీపీ పార్టీయే కావడంతో సరైన చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. తనకు టీడీపీతో 37 సంవత్సరాల అనుబంధం లేదని, ఆ పార్టీ ఎన్ఆర్ఐ సెల్‌కు తాను సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

