త్రిపురారం, జూన్ 03 : రెవెన్యూ సదస్సుల్లో సాదాబైనామాల దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు నల్లగొండ జిల్లా త్రిపురారం తాసీల్దార్ గాజుల ప్రమీల తెలిపారు. భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో భాగంగా తొలిరోజు మంగళవారం మండలంలోని పెద్దదేవులపల్లి, అంజనపల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతు సదస్సుల్లో సాదాబైనామాల దరఖాస్తులు, లావోని పట్టాల దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు చెప్పారు. పెద్దదేవులపల్లి గ్రామంలో 213, అంజనపల్లి గ్రామంలో 324 దరఖాస్తులు రైతులు అందించడం జరిగిందన్నారు.
ధరణిలో మిస్ అయిన సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులు కూడా అందాయన్నారు. ఇట్టి దరఖాస్తులను రైతు సదస్సుల అనంతరం విచారణ జరిపి కలెక్టర్‌కు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తాసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐలు గుండెబోయిన సైదులు, బ్రహ్మదేవర సంతోష, సీనియర్ అసిస్టెంట్ కల్పన, ముత్యమమ్మ, రేణుక, సంపత్, రమేశ్, ముడిమల్ల బుచ్చిరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, అవిరెండ్ల వీరయ్య, గజ్జల నారాయణమ్మ, ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు.
Tripuraram : సాదాబైనామాలకు దరఖాస్తుల వెల్లువ : తాసీల్దార్ ప్రమీల