Paris Olympics 2024 : ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్(Table Tennis)లో భారత పోరాటం ముగిసింది. ఇప్పిటికే వ్యక్తిగత విభాగాల్లో నిరాశపరిచిన పెడ్లర్లు టీమ్ ఈవెంట్లోనూ సత్తా చాటలేకపోయారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల టీటీ జట్టు ఓటమి పాలైంది.
మనికా బత్రా(Manika Batra), ఆకుల శ్రీజ(Akula Sreeja), అర్చనా కామత్ల బృందం జర్మనీ జట్టు చేతిలో కంగుతిన్నది. 1-3తో ఓడి పతకం వేటను ముగించింది. దాంతో, పురుషుల మాదిరిగానే మహిళ పెడ్లర్లు సైతం ఉత్త చేతులతోనే స్వదేశం రానున్నారు.
💔#Paris #UTT4India #TeamIndia #UTT #UltimateTableTennis #TableTennis pic.twitter.com/fjQSCJHryh
— Ultimate Table Tennis (@UltTableTennis) August 7, 2024
విశ్వ క్రీడల్లో పతకంపై ఆశలు రేపిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు కీలక మ్యాచుల్లో ఓడారు. వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సీనియర్ ఆటగాడు అచంత శరత్ కమల్ టీమ్ ఈవెంట్లోనూ మెరవలేదు. దాంతో, పారిస్ ఒలింపిక్స్లో పురుషుల టీమ్ చెత్త ప్రదర్శనతో నిరాశపరిచింది. అచంత శరత్ కమల్, మానవ్ థక్కర్, హమిత్ దేశాయ్ త్రయం క్వార్టర్స్ బెర్తు సాధించలేకపోయింది. ఆగస్టు 7వ తేదీన చైనా జట్టుతో జరిగిన 16వ రౌండ్ పోటీల్లో భారత బృందం 0-3తో ఓటమి పాలైంది.
We gave it our all 👏#Paris #UTT4India #TeamIndia #UTT #UltimateTableTennis #TableTennis pic.twitter.com/qkVwLwyFOQ
— Ultimate Table Tennis (@UltTableTennis) August 6, 2024