Avengers: Doomsday | తమిళ అగ్ర నటుడు ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల రాయన్ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో రూ.80 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, అపర్ణా బాలమురళితో పాటు నిమిషా సజయన్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా అనంతరం ధనుష్ ఇళయరాజా బయోగ్రఫీ చిత్రంలో నటించబోతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక దీనితో పాటు తెలుగులో కుబేరా అనే చిత్రం చేస్తున్నాడు ధనుష్. శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ధనుష్ హలీవుడ్ మూవీ చేయబోతున్నట్లు అది కూడా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన అవెంజర్స్ చిత్రంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మార్వెల్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రాలు అవెంజర్స్ డూమ్స్‌డే (Avengers: Doomsday), అవెంజర్స్ సీక్రెట్ వార్స్(Avengers: Secret Wars). ఇందులో మొదటి భాగం అవెంజర్స్ డూమ్స్‌డే 2026లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ 2027 లో రానుంది. అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించేది. డాక్టర్ డూమ్(dr doom) అనే ఫిక్షనల్ విలన్ పాత్రలో హలీవుడ్ నటుడు ఐరన్ మ్యాన్ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోనే ధనుష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను రుసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తుండగా.. ఒక సూపర్ హీరో పాత్ర కోసం ధనుష్‌ను రూసో బ్రదర్స్ సంప్రదించినట్లు తెలుస్తుంది.
రూసో బ్రదర్స్‌కు ధనుష్‌కు ఇంతకుముందే పరిచయం ఉంది. రూసో బ్రదర్స్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమాలో ధనుష్ కీలక పాత్రలో నటించాడు. దీంతో అవెంజర్స్ డూమ్స్‌డే మూవీ కోసం కూడా ధనుష్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అవెంజర్స్ డూమ్స్‌డేలో డాక్టర్ డూమ్ అనే పాత్ర మార్వెల్ కామిక్స్‌లో ఉండే సూపర్‌విలన్ రోల్. ఈ పాత్ర ఇప్పటికే స్పైడర్ మ్యాన్‌తో పాటు, ఫెంటాస్టిక్ ఫోర్ చిత్రాలలో విలన్‌గా కనిపించి అలరించింది. తాజాగా ఈ పాత్రను ఇప్పుడు రాబర్ట్ చేయనున్నాడు. రుసో బ్రదర్స్ ఈ సినిమాలకు దర్శకత్వం వహించనున్నారు.
Also Read..
Sweety Nauty Crazy | ప్రేమ దేశం హీరో త్రిగుణ్ కొత్త సినిమా లాంచ్.. వివరాలివే
TG Rains | తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం