Sweety Nauty Crazy | కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. పీఎస్వీ గరుడ వేగ, కొండా, డియర్ మేఘ, ప్రేమ దేశం చిత్రాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త్రిగుణ్ (Thrigun). ఈ యువ నటుడు కొత్త సినిమా అప్డేట్ను అందరితో షేర్ చేసుకున్నాడు. త్రిగుణ్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం స్వీట్ నాటీ క్రేజీ (Sweety Nauty Crazy).
రాజశేఖర్ జి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టారు. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేయగా.. బెక్కెం వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. కథతో మొదలైన నా ప్రయాణానికి మీడియా మద్దతుగా నిలిచిందని. సినిమా కథకు తగినట్టుగానే స్వీటీ, నాటీ, క్రేజీలా ఉండబోతుందన్నాడు ఈ సందర్భంగా అన్నాడు త్రిగుణ్. అరుణ్, రాజశేఖర్‌తో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్‌గా ఉందని అన్నాడు. ఈ మూవీలో శ్రీజిత ఘోష్, ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Ram Pothineni | బాలీకి వెళ్లి 18 కిలోలు బరువు తగ్గా.. డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్‌పై రామ్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!