జడ్చర్ల, ఆగస్టు 7 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని ఏదో చోట గురుకులాలు, కస్తూర్బాల్లోని విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అవుతూనే ఉన్నది. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని(Jadcharla) మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గురుకులంలో(Minority Gurukulam) 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు(Illness) గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉదయం అల్పాహారంలో భాగంగా కిచిడీ చేసిన తర్వాత 10 గంటల సమయంలో పలువురు కండుపు నొప్పి తోపాటు వాంతులు చేసుకున్నారు. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో స్కూల్కు వచ్చి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకొన్న కలెక్టర్ విజయేంద్రబోయి, అదనపు కలెక్టర్ విజయేంద్రప్రతాప్ గురుకులానికి చేరుకొని అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థి తిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలతో పాటు వండిన వంటకాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.