Asia Cup 2024 : స్వదేశంలో దక్షిణాఫ్రికాను హడలెత్తించిన భారత మహిళల జట్టు శ్రీలంక (Srilanka)కు బయల్దేరింది. త్వరలో జరుగబోయే ఆసియా కప్ (Asia Cup 2024) కోసం మంగళవారం హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)సేన లంక విమానం ఎక్కేసింది. తమ పర్యటనకు సంబంధించిన ఫొటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూలై 19వ తేదీన జరగనున్న ఆసియా కప్‌లో తొమ్మిదో ఎడిషన్‌లో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
ఆసియా కప్ కోసం పదిహేను మందితో కూడిన బృందాన్ని భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీళ్లతో పాటు మరో నలుగురిని ట్రావెల్ రిజర్వ్‌గా తీసుకున్నారు. అయితే. ఈ మెగా టోర్నీపై ఆశలు పెట్టుకున్న షబ్నం షకీల్, అమన్‌జోత్ కౌర్‌లను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. జూలై 19వ తేదీన టోర్నీ ఆరంభం కానుండగా.. అదే రోజు సాయంత్రం భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)తో తలపడనుంది.
భారత బృందం : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ(వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, దయలాన్ హేమలత, అశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజన సంజీవన్.
ఆసియా కప్‌లో పురుషుల జట్టు మాదిరిగానే టీమిండియా మహిళల టీమ్‌కు కూడా ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ భారత్ ఏకంగా 7 సార్లు చాంపియన్‌గా నిలిచింది. తొమ్మిదో సీజన్ ఆసియా కప్‌లో 8 జట్లు ఆడుతున్నాయి. గ్రూప్ ‘ఏ’లో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన పాకిస్థాన్, యూఏఈ, నేపాల్ జట్లతో లీగ్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేషియాలు గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లోని టాప్ -2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జూలై 26న సెమీస్ మ్యాచ్‌లను.. జూలై 28న ఫైనల్ ఫైట్‌ను నిర్వహించనున్నారు.