Encounter | జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లా జవాను మృతి
Encounter | జమ్ముకశ్మీర్ లో దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ ఒకరు మృతి చెందాడు.
అమరావతి : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్(Jawan) ఒకరు మృతి చెందాడు. శ్రీకాకుళం (Srikakulam ) సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన డొక్కరి రాజేశ్ ఈ ఘటనలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
గత 7 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్న రాజేశ్ మరణ వార్త కుటుంబంలో తీరని విషాదం నింపింది. మంగళవారం ఉదయమే రాజేశ్ మరణం వార్త తెలియగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తనకు వచ్చే జీతంలో కొంత భాగం గ్రామంలోని పేద విద్యార్థుల చదువు కోసం సహాయం చేసేవాడని గ్రామస్తులు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లోని దోడా(Doda) లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు ఏపీకి చెందిన రాజేశ్ ఉన్నారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 20 నిమిషాలకుపైగా కాల్పులు జరిగాయని పేర్కొంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన కశ్మీర్ టైగర్ ప్రకటించింది.
Read more :
Asaduddin Owaisi | దోడా ఎన్కౌంటర్లో జవాన్ల మరణం మోదీ సర్కార్ వైఫల్యమే : అసదుద్దీన్ ఓవైసీ
Mehbooba Mufti | కశ్మీర్‌కు వచ్చే సైనికులు శవపేటికల్లో వెనుతిరుగుతున్నారు : మెహబూబా ముఫ్తీ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

