Asaduddin Owaisi | దోడా ఎన్కౌంటర్లో జవాన్ల మరణం మోదీ సర్కార్ వైఫల్యమే : అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi : జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని దుయ్యబట్టారు.
Asaduddin Owaisi : జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని దుయ్యబట్టారు. తీవ్రవాదుల ఇండ్లలోకి వెళ్లి మట్టుబెడతామని ప్రధాని మోదీ తరచూ చెబుతుంటారని, ఆయన అలా చెబుతుంటే ఇప్పుడు జరుగుతున్నదేంటని ఓవైసీ నిలదీశారు.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కాషాయ పాలకులు ఉగ్రవాదాన్ని నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు. కాగా, దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు తెలిపారు.రాత్రి 9 గంటల సమయంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని, భారీ కాల్పులు జరిగాయని ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 20 నిమిషాలకుపైగా కాల్పులు జరిగాయని పేర్కొంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన కశ్మీర్ టైగర్ ప్రకటించింది.
Read More :
Pakistan | అచ్చుగుద్దినట్టు అనుకరిస్తున్నాడు.. పాక్‌లో యంగ్ బుమ్రా.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

