Tata Curvv | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) తన టాటా కర్వ్ కూపే ఎస్యూవీ (Tata Curvv Coupe SUV) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చేనెల ఏడో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) వర్షన్లలో మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో టాటా కర్వ్ (Tata Curvv) ప్రీ బుకింగ్స్ అనుమతించింది. ఆసక్తి గల కస్టమర్లు రూ.21 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. అయితే, అధికారికంగా టాటా మోటార్స్ ప్రీ-ఆర్డర్స్ ప్రారంభించలేదు. హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ (Volkswagen Taigun), స్కోడా కుషాక్ (Skoda Kushaq) తదితర కార్లకు టాటా మోటార్స్ (Tata Motors) ఫ్లాగ్ షిప్ కారు టాటా కర్వ్ (Tata Curvv) గట్టి పోటీ ఇవ్వనున్నది. త్వరలో రానున్న సిట్రోన్ బాసాల్ట్ విజన్ కూపే ఎస్యూవీ
కంపాక్ట్ ఎస్యూవీ (Compact SUV) సెగ్మెంట్లోనే టాటా కర్వ్ (Tata Curvv) అత్యంత స్టైలిష్‌గా ఉంటుంది. 2022 ప్రారంభంలోనే టాటా మోటార్స్ (Tata Motors).. ఈ టాటా కర్వ్ (Tata Curvv) మోడల్ కారును ఆవిష్కరించింది. ఈవీ సెగ్మెంట్‌తోపాటు ఐసీఈ మోడల్లోనూ వస్తున్న తొలి ఎస్యూవీ కూపే (SUB Coupe) కారు ఇది. న్యూ టాటా పంచ్.ఈవీ (Tata Punch.ev) మాదిరిగా పలు ఫీచర్లతో యాక్టివ్.ఈ (Active.e) ప్లాట్‌ఫామ్ రూపుదిద్దుకున్నది టాటా కర్వ్ (Tata Curvv). టాటా న్యూ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కారు 55-60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తోపాటు సింగిల్ చార్జింగ్ చేస్తే సుమారు 450 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
టాటా కర్వ్ కూపే ఎస్యూవీ (Tata Curvv Coupe SUV) 12.5 – అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ యూఐ, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్, న్యూ ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ ఇల్యూమినేటెడ్ టాటా లోగో, పెడల్ షిఫ్టర్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లతో లెవల్ 2 అడాస్ ఫీచర్లు ఉంటాయి.
Hyundai Exter CNG | సీఎన్జీ వేరియంట్లో ఎక్స్టర్ హెచ్‌వై-సీఎన్జీ.. రూ.8.5 లక్షల నుంచి షురూ..!
MG Motor CUV EV | టాటా కర్వ్.ఈవీకి పోటీగా ఎంజీ సీయూవీ ఈవీ.. లాంచింగ్ ఎప్పుడంటే..?!
Realme GT 6T | కొత్త కలర్ ఆప్షన్ లో రియల్ మీ జీటీ 6టీ.. 20 నుంచి సేల్స్ షురూ..!
iQoo Z9 Lite 5G | ఐక్యూ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ జడ్9 లైట్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Kia EV6 | 1138 ఈవీ6 కార్లను రీకాల్ చేస్తున్న కియా.. కారణమిదేనా..?!