Sowcar Janaki | ప్రతిభకు అదృష్టం తోడై మొదటి సినిమాతోనే ఆమె కథానాయకురాలు అయ్యారు. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆ ఒక్క పాత్రతోనే మంచి నటిగా గుర్తింపు పొందారు షావుకారు జానకి . పాండవులు పాండవులు తుమ్మెదా.. పంచ పాండవులోయమ్మ తుమ్మెదా… అంటూ హుషారుగా ఆడి పాడిన జానకి (Sowcar Janaki) తెలుగు ప్రేక్షకుల మనసులో కొలువుండి పోయారు. తను నటించిన `షావుకారు` (Shavukaru) అనే సినిమా పేరునే ఆమె తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
జానకి తనకు ఆ చిత్రంలో అవకాశం ఎలా వచ్చిందో ఒక ఇంటర్వూలో వివరించారు. జానకి తన పదమూడవ ఏట నుంచే మద్రాస్ లో రేడియో ప్రోగ్రామ్ లు ఇచ్చేదట. ఆ కాలంలో ఆడపిల్లలకు అంత స్వేచ్చ కూడా ఉండేది కాదు అని వాళ్ల తండ్రి ప్రోత్సాహంతో రేడియో ప్రోగ్రామ్ లు చేయగలిగాను అని ఆమె తెలిపింది. అయితే రేడియోలో జానకి గొంతు విని బి.ఎన్.రెడ్డి (వారాహి సంస్థ) ఎవరీ అమ్మాయి అని తెలుసుకుని.. ఆవిడ పని చేసే రేడియో స్టేషన్ కు వెళ్ళి మా సినిమాలో ఓ వేషం ఉంది వేస్తావా ? అనడిగారు. అప్పుడు తనకి పదిహేండ్లు కూడా లేవు. ఈ విషయాన్ని ఇంటికెళ్ళి చెప్పగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొలేదు.
ఆ తరువాత రేడియో ఇంజనీర్ గా పనిచేస్తున్న శంకరమంచి శ్రీనివాస్ తో పెళ్ళి చేశారు. పెళ్ళయ్యాక చాలా సమస్యలు ఎదురుకున్నానని, పిల్లలకు కనీసం మూడు పూటలా తిండి కూడా పెట్టలేని పరిస్థితి. సంసారం గడవడం కూడా కష్టంగా ఉండేది. ఏం చేయాలాని ఆలోచిస్తున్న సమయంలో బి.ఎన్. రెడ్డిగారు గుర్తొచ్చారని జానకి చెప్పారు. ఆమె తన భర్త అనుమతితో బి.ఎన్. రెడ్డిని సినిమాలలో వేశాలు ఏమన్నా ఇస్తారాని కలిసింది. ఆమె ఆర్థిక పరిస్థితి విని సానుభూతితో జానకిని ఆయన తమ్ముడైన చక్రపాణి వద్దకు పంపించారు. ఆ సమయంలో మహా నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు హీరోగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ఓ సినిమా తీయబోతున్నారు. జానకికి స్క్రీన్ టెస్ట్ చేసి ఇంటికి పంపించారట.
హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ అయ్యావన్నారు.. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు చక్రపాణి ,ఎల్వీ ప్రసాద్ ,జానకి వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయి నువ్వు టెస్ట్ లో పాసయ్యావు హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ అయ్యావు అన్నారు. అప్పుడు నా ఆశ్చర్యానికి అంతులేదు. ఏదో చిన్న వేశం ఇస్తారనుకుంటే.. ఏకంగా హీరోయిన్ పాత్రే వరించేసరికి.. నా ఆనందానికి అవధుల్లేవు అన్నారు జానకి.
ఏదో పెద్ద హీరోయిన్ అవ్వబోతున్నానని కాదు, ఆ సంబరం.. నా కుటుంబ కష్టాలు గట్టెక్కుతాయని.. నా కష్టాలన్ని తీరబోతున్నాయన్న ఆనందం అని చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో ఆమె. అలా షావుకారు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, ఆ సినిమా పెద్ద విజయం సాధించడం వలన ఆ సినిమా పేరే తన ఇంటి పేరుగా మారిపోవడం జరిగిందని జానకి అన్నారు. ఈ విధంగా `షావుకారు చిత్రంలో అవకాశం రావడం ,ఆ సినిమా పేరే తన ఇంటి పేరుగా “షావుకారు జానకిగా మారిపోయింది.
Janhvi Kapoor | స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జాన్వీకపూర్ Ulajh ట్రైలర్
Sardar 2 | మిషన్ కంబోడియా టైం.. కార్తీ సర్దార్ 2లో స్టార్ యాక్టర్
Kanguva | సూర్య కంగువ సాంగ్‌లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్