IND vs ENG : లార్డ్స్ మైదానంలో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. పేసర్ల విజృంభణతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నడ్డవిరిచింది టీమిండియా. మహ్మద్ సిరాజ్ (2-10) తొలి రెండు వికెట్లతో జోష్ నింపగా.. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (1-20), ఆకాశ్ దీప్(1-23)లు కీలక బ్యాటర్లను ఔట్ చేసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. రిస్కీ షాట్లు ఆడుతూ పైచేయి సాధించాలనుకున్న హ్యారీ బ్రూక్(23)ను బౌల్డ్ చేసిన ఆకాశ్ ఇంగ్లండ్‌ను ఆత్మరక్షణలో పడేశాడు. లంచ్ టైమ్‌కు జో రూట్ (17 నాటౌట్), బెన్ స్టోక్స్ (2 నాటౌట్)లు అజేయంగా నిలవగా 4 వికెట్ల నష్టానికి 98 రన్స్ చేసిన స్టోక్స్ సేన 98 ఆధిక్యంలో ఉంది.
లార్డ్స్‌లో నాలుగో రోజు తొలి సెషన్లో భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. దాంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు తమదైన బజ్ బాల్ ఆడలేక అవస్థలు పడ్డారు. పేసర్ సిరాజ్ ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ బెన్ డకెట్(12)ను ఔట్ చేసిన అతడు.. ఆ తర్వాత ఓలీ పోప్(4)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. డీఎస్పీ ధాటికి 42 పరుగుల వద్ద స్టోక్స్ సేన రెండో వికెట్ కోల్పోయింది. కష్టాల్లో పడిన జట్టును ఆదుకోవాలనుకున్న జాక్ క్రాలే (22)ను నితీశ్ రెడ్డి బోల్తా కొట్టించాడు.
After two scoops for four by Brook in his previous over, Akash Deep gets the last laugh! 🎯 pic.twitter.com/mmSmKmWFHC
— ESPNcricinfo (@ESPNcricinfo) July 13, 2025
ఆ తర్వాత బజ్ బాల్ తరహా ఆటతో ఒత్తిడి పెంచాలనుకున్న హ్యారీ బ్రూక్ (23)ను ఆకాశ్ దీప్ బౌల్డ్ చేసి నాలుగో వికెట్ అందించాడు. చూస్తుండగానే కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో జట్టను గట్టెక్కిచే బాధ్యతను జో రూట్(4), బెన్ స్టోక్స్(2 )లు భుజాన వేసుకున్నారు. వీళ్లిద్దరూ లంచ్ టైమ్‌కు ఐదో వికెట్‌కు రన్స్ జోడించారు. భోజన విరామం తర్వాత ఈ ద్వయాన్ని, జేమీ స్మిత్‌ను త్వరగా ఔట్ చేస్తే ఐదు టెస్టుల సిరీస్‌లో గిల్ సేన ముందంజ వేసే అవకాశముంది.