Iga Swiatek : పొలాండ్ బ్యూటీ ఇగా స్వియాటెక్ (Iga Swiatek) గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. ఏడాదంతా కష్టాల కడలి, గడ్డు రోజులు వెంటాడినా.. సంకల్ప బలంతో రాకెట్ అందుకుంది. వింబుల్డన్(Wimbledon)లో అద్భుతంగా రాణించి మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది స్వియాటెక్. తద్వారా చీకటి తర్వాత వెలుగుదారి ఉంటుందనడానికి తానే ఉదాహరణ అని చాటిందీ చాంపియన్. శనివారం జరిగిన ఏకపక్ష పోరులో అమెరికాకు చెందిన అమందా అమ్నీసిమోవా(Amanda Amnisimova)ను చిత్తుగా ఓడించి తొలిసారి టైటిల్‌ను ముద్దాడిందీ టాప్ సీడ్.
వింబుల్డన్ విజేతగా నిలిచిన స్వియాటెక్ ఒక్క ఏడాదిలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 2024లో డోపింగ్ టెస్టులో పట్టబడిన ఆమె అదృష్టవశాత్తూ నిషేధం నుంచి తప్పించుకుంది. జెట్ ల్యాగ్, నిద్రలేమి నుంచి బయటపడేందుకు తీసుకున్న మందుల కారణంగానే తన శాంపిల్ పాజిటివ్ వచ్చిందని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యకు వివరణ ఇచ్చింది. అలా బతికిపోయిన స్వియాటెక్ ఆటపై దృష్టిసారించింది. అంతలోనే వాళ్ల తాత మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకునేలోపు ర్యాంక్సింగ్స్‌లో వెనకబడింది టెన్నిస్ స్టార్. పైగా ఏడాదిలో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. అయినా సరే నిరుత్సాహపడలేదు.
Clay court Queen.
Hard court Queen.
Grass court Queen.#Wimbledon pic.twitter.com/KvdjYwbwgw— Roland-Garros (@rolandgarros) July 12, 2025
అందుకే.. వింబుల్డన్ ట్రోఫీ అందుకున్నాక ఈ ప్రయాణం చాలా కష్టంగా సాగింది. తొలిసారి ఇక్కడ టైటిల్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని స్వియాటెక్ తెలిపింది. ఫైనల్లో పొలాండ్ భామ ధాటికి అమందా చేతులెత్తేసింది. వరుసగా రెండు సెట్లలో ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. 57 నిమిషాల పాటు సాగిన పోరులోప్రత్యర్థి ఏమాత్రం అవకాశం ఇవ్వని స్వియాటెక్ 6-0, 6-0తో జయకేతనం ఎగురవేసి తమ దేశం తరఫున వింబుల్డన్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తంగా ఆరో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీతో మెరిసిన స్వియాటెక్ విక్టరీ తర్వాత కోర్టులో గెంతులు వేస్తూ సంబురాలు చేసుకుంది.