IND vs ENG : లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు చెలరేగుతున్నారు. పిచ్ సహకరించడంతో పోటీపడీమరీ వికెట్లు తీస్తున్నారు. మహ్మద్ సిరాజ్ (2-10) ధాటికి రెండు వికెట్లు పడడంతో డీలా పడిన ఇంగ్లండ్‌ను నితీశ్ కుమార్ రెడ్డి (1-8) దెబ్బ కొట్టాడు. డేంజరస్ ఓపెనర్ జాక్ క్రాలే(22)ను పెవిలియన్ చేర్చాడు. గల్లీలో యశస్వీ జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో మూడో వికెట్ కోల్పోయింది. మూడో రోజు బుమ్రా బౌలింగ్‌లో ఓవర్ యాక్షన్ చేసినందుకు క్రాలేను ఔట్ చేసిన తర్వాత అతడికి నితీశ్ సింహగర్జనతో వీడ్కోలు పలికాడు.
లార్డ్స్‌లో నాలుగో రోజు తొలి సెషన్లో భారతబౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పేసర్ సిరాజ్ ఆతిథ్య జట్టు బ్యాటర్లకు తన పేస్ పవర్ చూపిస్తూ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత బెన్ డకెట్(12)ను ఔట్ చేసిన అతడు.. ఆ తర్వాత ఓలీ పోప్(4)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో రివ్యూ తీసుకొని మరీ వికెట్ సాధించింది టీమిండియా. దాంతో, డీఎస్పీ ధాటికి 42 పరుగుల వద్ద స్టోక్స్ సేన రెండో వికెట్ కోల్పోయింది.
Nitish Kumar Reddy 🤝 Yashasvi Jaiswal
England 3 down as Zak Crawley departs!
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND | @NKReddy07 | @ybj_19 pic.twitter.com/jk8qGjcdPb
— BCCI (@BCCI) July 13, 2025
కష్టాల్లో పడిన జట్టును ఆదుకునే క్రమంలో ధాటిగా ఆడబోయిన జాక్ క్రాలే (22)ను నితీశ్ రెడ్డి బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (5), జో రూట్(4)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టను ఆదుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికీ ఇంగ్లండ్ 56 పరుగుల ఆధిక్యంలో ఉంది.