BRS leaders | మల్లాపూర్, జూలై 19: రాష్ట్రస్థాయిలో ఎక్కడ లేని విధంగా వరుసగా కోరుట్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తో పాటు, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ పై ఓడిపోయి మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావుకు ఎమ్మెల్యేపై మాట్లాడే నైతిక అర్హత లేదని మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్దం శరత్ గౌడ్, మాజీ ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ దేవ మల్లయ్య అన్నారు.
మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాల అమలు తీరుపై మాట్లాడుతున్న మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నేత జలపతిరెడ్డి తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో తనతో పాటు, ఆయన సతీమణికి సైతం నిబందలనకు ఉల్లఘించి ఇద్దరు పెన్షన్లను తీసుకోని లబ్ధి పొందారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత తమ బీఆర్ఎస్ నాయకుల పైన అధికారం ఉపయోగించి అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేయించారన్నారు. అలాగే మాజీ ఎంపీపీ రాజన్న వందల ఎకరాల భూమిని బీఆర్ఎస్ నేత మల్లయ్య ఆక్రమ పట్టాలు చేసుకున్నాడని ఆరోపించారని, దీనికి గాను తనతో పాటు, తమ కుటుంబ సభ్యులకు కలిపి కేవలం 15 ఎకరాల భూమి మాత్రమే ఉందని, మిగతాగుంట భూమి తనకు ఉన్న కాంగ్రెస్ నాయకులకే పట్టా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఏమి చేశారో ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమాని తెలిపారు.
ఇక్కడ మాజీ సింగిల్ విండో చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు మేకల సతీష్, నాయకులు కొమ్ముల జీవన్‌రెడ్డి, బండి లింగస్వామిగౌడ్, చిట్యాల లక్ష్మణ్, మహ్మద్ రఫీ, బదినపల్లి ప్రేమ్, చింతల రమేష్, బిట్ల నరేష్, బైరి రవి, కొంపల్లి రాజు, రాజశేఖర్, సునీల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు