తుంగతుర్తి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే పై చేసిన భూ దందాలు, ఆక్రమణలు, లూటీలు, దాడులు, దౌర్జన్యాలు, మర్దర్ల ఆరోపణలు అన్ని నీకే వెన్నతో పెట్టిన విద్యలు. ఒకసారి నీ జీవితాన్ని నెమరు వేసుకోవాలని సూచించారు. నీ ఊకదంపుడు చర్యలకు భయపడేది లేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల కాలంలొ ఈ నియోజకవర్గన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి కాళేశ్వరం జలాలను తెచ్చి తుంగతుర్తి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిందన్నారు. మా పదేండ్ల అభివృద్ధిపై నీ ఊరిలోనే చర్చిద్దామని సవాల్ విసిరారు. మరోసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, గోపగాని రమేష్, మట్టిపెల్లి వెంకట్, గుడిపాటి వీరయ్య, సోమేశ్ , తడకమళ్ల రవికుమార్, విజయ్ నాయక్, సాయికిరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.